నంద్యాలలో సప్తాహ భక్తి వైభవం: ఆధ్యాత్మిక ప్రవచనాలు

699చూసినవారు
నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల, గీతా భవన్‌లో ఆదివారం జ్ఞాన ప్రసాద్ గురువు ఆధ్వర్యంలో సప్తాహ భక్తి వైభవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తి, ఆధ్యాత్మికత, భగవద్గీతా సూత్రాలు, జీవన విధానంపై గురువు ప్రవచనాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకులు తిమ్మయ్య, రామకృష్ణ, గాంధీ, అనిల్ పాల్గొన్నారు. ఈ సప్తాహ భక్తి వైభవం మరో ఏడు రోజులపాటు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్