ప్యాపిలి మండలం చండ్రపల్లె సర్పంచ్ సరోజమ్మ భర్త, 80 ఏళ్ల జొన్నగిరి వెంకట నాగిరెడ్డి అనారోగ్యంతో గురువారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చండ్రపల్లెకు చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డితో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.