నంద్యాల జిల్లాలో తాజా ఓటరు జాబితా ప్రకారం, మొత్తం 10,84,208 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా 489 గ్రామ పంచాయతీలు, 4,926 వార్డులకు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ దాదాపు పూర్తయ్యింది. బ్యాలెట్ బాక్సుల సేకరణ కూడా కొనసాగుతోంది. గత రెండు నెలలుగా జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో, ఎన్నికల నోటిఫికేషన్‌పై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది.