బనగానపల్లెలో వైసీపీ భారీ ర్యాలీ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు

342చూసినవారు
బనగానపల్లెలో వైసీపీ భారీ ర్యాలీ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్