కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసన తెలుపుతూ నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో
వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. శిల్పా రవి కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నంద్యాల పట్టణ వీధులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.