స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలి

0చూసినవారు
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలి
పాణ్యం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సోమవారం పాణ్యo ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకట రెడ్డి తో కలిసి పాణ్యం మండల పరిధిలోని అన్ని గ్రామాల టీడీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మండలంలోని గ్రామాలలోని టిడిపి నాయకులు కలిసికట్టుగా పని చేయాలని, స్థానిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించేందుకు గ్రామాలలోని ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్