సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - పాణ్యం ఏమ్మెల్యే

0చూసినవారు
సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - పాణ్యం ఏమ్మెల్యే
నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చాను. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్