స్థానిక గడివేముల గ్రామానికి చెందిన
టీడీపీ కార్యకర్త అన్వర్ భాష మట్టి గృహం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. గృహం కూలిన సమయంలో గృహంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు దేశం సత్యనారాయణ రెడ్డి, యువ నాయకులు దేశం శివనాగిరెడ్డిలు అన్వర్ భాష కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందజేస్తామని తెలిపారు.