అమరావతి ఛాంపియన్‌షిప్‌: క్రీడాకారులకు చందు నాయక్ ఆదేశం

1533చూసినవారు
అమరావతి ఛాంపియన్‌షిప్‌: క్రీడాకారులకు చందు నాయక్ ఆదేశం
పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చందు నాయక్, కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరిగే అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ నెల 7న కబడ్డీ, బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలు, 11న ఖోఖో, వాలీబాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరగనున్నాయి. అండర్-17, అండర్-23 విభాగాల్లో ఎంపికైన క్రీడాకారులు నిర్ణీత తేదీల్లో కర్నూలుకు చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్