కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని నెరణికి తాండా గ్రామంలో రాము నాయక్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. రాము నాయక్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, ఈ విషయం తెలుసుకున్న మహిళ కుమారుడు రాఘవేంద్ర నాయక్.. రాము నాయక్ పై గొడ్డలితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయపడిన రాము నాయక్ ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.