రెండు ఓట్లూ సైకిల్‌కే: ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ పిలుపు

6చూసినవారు
రెండు ఓట్లూ సైకిల్‌కే: ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ పిలుపు
పత్తికొండ పట్టణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సాంబశివరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సుంకం గేట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో గడప గడపకూ వెళ్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను కలిశారు. సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్