పత్తికొండ ఎస్. టీ. యు కార్యాలయంలో ఆదివారం భగత్ సింగ్, గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని, గుర్రం జాషువా కవిత్వం ద్వారా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడారని వక్తలు తెలిపారు. ఉపాధ్యాయులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.