ఆత్మకూరు: పల్స్ పోలియోకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బుడ్డా

1124చూసినవారు
ఆత్మకూరు: పల్స్ పోలియోకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బుడ్డా
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్