ఆత్మకూరు: మోటార్ల రాగి తీగల దొంగతనం.. రైతుల ఆవేదన

569చూసినవారు
నీటి కొరతతో పంటలు ఎండిపోతున్న సమయంలో కరివేన గ్రామ శివారులో రైతులు మరో కష్టాన్ని ఎదుర్కొన్నారు. సుమారు 30 మోటార్ల వద్ద ఉన్న రాగి తీగలను దొంగలు కత్తిరించి తీసుకెళ్లారు. బావుల నుంచి నీరు పారించి పంటలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతులు ఈ దొంగతనం వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్