మహానంది మండలం బుక్కాపురంలోని బైసాని ట్రేడర్స్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీకి ఉపయోగిస్తున్న APIIMS ఆన్‌లైన్ యాప్ పనితీరు, రైతులకు జరుగుతున్న పంపిణీ విధానం, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. పంపిణీలో పారదర్శకత పాటించడంతో పాటు స్టాక్ వివరాలు, ఆన్‌లైన్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.