శ్రీశైలానికి రూ. కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాలు విరాళం

566చూసినవారు
శ్రీశైల దేవస్థానానికి కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు విలువైన బంగారు, వెండి ఆభరణాలను విరాళంగా సమర్పించారు. వీరిచ్చిన వెండి వస్తువుల బరువు 42 కేజీలు 516 గ్రాములు కాగా, బంగారు ఆభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీగ్రాములు ఉంది. ఈ విరాళాల మొత్తం విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని దాతలు తెలిపారు. దేవస్థానం అధికారులు దాతలను అభినందించి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్