పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహామంగళహారతుల అనంతరం ఆలయ మహాద్వారం నుంచి గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి, అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిలో గిరిప్రదక్షిణ సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.