శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

654చూసినవారు
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు జరిగాయి. దేశ శాంతి, సమృద్ధి కోసం ఆలయ అర్చకులు లోకకల్యాణ సంకల్పం పఠించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం సాగింది. జానపద కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్