కోవెలకుంట్ల: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య

2207చూసినవారు
కోవెలకుంట్ల: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య
కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సంజామల మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన ఇస్సాకు (56) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై, అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్