మహానంది హుండీ ఆదాయం రూ. 32 లక్షలు

439చూసినవారు
మహానంది హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. గత 31 రోజుల్లో రూ. 32,29,396 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా అన్నప్రసాదం, గోసంరక్షణ వంటి వాటికి ప్రత్యేకంగా విరాళాలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్