మహానందిలో ఈ నెల 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి సమన్వయ సమావేశం పూర్తి కాగా, త్వరలో రెండో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.