ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 18వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పాదయాత్రల ద్వారా భక్తులు శ్రీశైలం చేరుకుంటుండగా, దేవస్థానం అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.