శిల్పాకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సవాల్

472చూసినవారు
శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి సవాల్ విసిరారు. ఆత్మకూరులో జరిగిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ చేరుతున్నాయని, కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్