వెలుగోడులో గురువారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏపీ జన్మన్ పథకం నిధులతో 2.75 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ వసతి గృహం నాణ్యమైన విద్యకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.