బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో బుధవారం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మలిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్లను క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి పంపిణీ చేస్తోందని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.