తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు సిట్ నిర్ధారించిన నేపథ్యంలో, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఎన్డీయే కూటమి శ్రేణులతో కలిసి శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుద్ధి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర ప్రసాద కల్తీ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.