మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

336చూసినవారు
మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల
మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రధాన కార్యక్రమాలను ఆలయ పండితులు వెల్లడించారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 13న అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభమై, 18న పూర్ణాహుతి, తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఫిబ్రవరి 14న శేష, సింహ వాహన సేవలు, 15న లింగోద్భవ కాల అభిషేకం, కళ్యాణోత్సవం, 16న అశ్వ వాహన, పుష్ప పల్లకి సేవలు, 17న మహా రథోత్సవం జరగనున్నాయి. భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్