శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో రూ. 10 లక్షలు, కడమలకాల్వ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. వెంగళరెడ్డిపేటలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, కడమలకాల్వలో ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.