శ్రీశైలం: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ట్రాఫిక్ చర్యలు

737చూసినవారు
శ్రీశైలం: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ట్రాఫిక్ చర్యలు
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాలు, స్నానఘాట్లను మంగళవారం స్వయంగా పరిశీలించిన ఆయన, భక్తులు పోలీసుల సూచనలు పాటించి వాహనాలను క్రమబద్ధంగా పార్క్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసే దిశగా జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్