శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ తనిఖీ కేంద్రం వద్ద వరి ధాన్యం లోడు లారీలు చెస్ అమౌంట్ చెల్లించడం కోసం రోడ్డుపై నిలిపివేయడంతో గురువారం దాదాపు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని వాహనదారులు, గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.