ఎమ్మిగనూరు - Yemmiganur

ఎస్సి స్మశాన వాటిక అభివృద్ధికి శ్రీకారం

ఎస్సి స్మశాన వాటిక అభివృద్ధికి శ్రీకారం

ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎస్సి స్మశాన వాటికలో ఎమ్మెల్యే డా. బివి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు మున్సిపల్ కమీషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ఎస్సి సెల్ టీడీపీ నాయకులు నాయకంటి అంబెడ్కర్, కదిరికోట షాలేం రాజు, అలవాల ప్రసాద్, ఫ్రాంచెష్, హమాలీ ఫ్రాంచెష్, ప్రభుదాస్ పాల్గొని సోమవారం ఉదయం ఎస్సి స్మశాన వాటిక అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు జేసీబీ తో ముళ్ళకంపలు, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేయిస్తున్నామని, అలాగే కాంపౌండ్ వాల్, మౌళిక వసతులు అన్నిటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా