ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్‌లో నిశాంత్ అనే విద్యార్థి ఒత్తిడితో మూడో అంతస్తు నుంచి దూకి గాయపడిన ఘటనపై సోమవారం విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోచింగ్ సెంటర్‌ను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థికి వైద్య ఖర్చులు భరించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.