ఎస్.ఐ.ఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని బి.ఎల్.ఓ కు అందజేసిన అంజయ్య

3చూసినవారు
ఎస్.ఐ.ఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని బి.ఎల్.ఓ కు అందజేసిన అంజయ్య
గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామ స్వర్ణ సచివాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్. ఐ. ఆర్) ప్రక్రియలో భాగంగా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి టి. అంజినయ్య తన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని (ఎస్. ఐ. ఆర్ ఫామ్) సంబంధిత బూత్. లెవెల్. ఆఫీసర్ (బి. ఎల్. ఓ) కు అందజేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్. ఐ. ఆర్) కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, నకిలీ లేదా మరణించిన వారి వివరాలను తొలగించడం కోసం దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సర్వే జరుగుతోందని టి ఆంజనయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్