కూతురు పెళ్లికి షాపింగ్ వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

3746చూసినవారు
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచోడి ప్రభు అనే వ్యక్తి మృతి చెందాడు. పెద్దకడబూరు నుంచి ఎమ్మిగనూరుకు వెళ్లి కుమారుడితో కలిసి గ్రామానికి బైక్‌పై వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రభు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కుమారుడిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వచ్చే నెలలో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, షాపింగ్ ముగించుకుని వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్