ఎమ్మిగనూరులో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు ఎమ్మెల్యే డా. బి. వి. జయ నాగేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వారి సేవలు అమూల్యమైనవని, రోగుల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు సమాజానికి నిజమైన సేవకుడని కొనియాడారు.