గోనెగండ్ల మండలం అలవాల గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో వాయిదా పడిన ఎస్ఎంసీ
ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలో చైర్మన్ గా ఫిలిప్, వైస్ చైర్మన్ గా కక్కిన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ ఆఫీసర్లు, పోలీసు సిబ్బంది, గ్రామ
టీడీపీ,
వైసీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.