
ఆదోనిలో డ్రంకెన్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు శిక్ష
ఆదోని పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి ఆదోని ఫస్ట్ అడిషనల్ జడ్జి లీలాసాయి సుభాష్ జైలు శిక్ష విధించారు. సోమవారం టూటౌన్ సీఐ రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సత్యసాయి జిల్లాకు చెందిన వెంకటాద్రికి 20 రోజులు, చాకలి నాగేంద్రకు 15 రోజుల జైలు శిక్ష పడింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు.






































