ఆదోని జిల్లా సాధనపై 163వ రోజు రిలే నిరాహార దీక్ష

6చూసినవారు
ఆదోని జిల్లా సాధనపై 163వ రోజు రిలే నిరాహార దీక్ష
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్‌తో జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 163వ రోజుకు చేరుకుంది. సోమవారం రామాంజనేయులు, వై. యాంకోబా, అనువాల పాండురంగ, రామకృష్ణ, బసాపురం మల్లయ్య దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు దాసరి గోవిందురాజులు, సుజ్ఞానమ్మ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం అభినందనీయమని, అయితే జిల్లా ప్రకటనపై హామీ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్