ఆదోని: ఫ్యాక్టరీల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

4చూసినవారు
ఆదోని: ఫ్యాక్టరీల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఆదోని దేవినగర్ కాలనీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫ్యాక్టరీల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పార్టీ, ఎస్ఎఫ్ఐ నేతలు రవి, శ్రీనివాసులు ఆదివారం ఆదోనిలో డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీల నుండి వెలువడే దుమ్ము, రసాయన, విష కాలుష్యం వల్ల ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని వారు ఆరోపించారు. స్థానిక మహిళలు, కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :