ఆదోని: అంబేద్కర్ సేవలు స్పూర్తిదాయకం

50చూసినవారు
ఆదోని: అంబేద్కర్ సేవలు స్పూర్తిదాయకం
ఆదోని మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ, సమీకృత బాలికల వసతి గృహంలో సోమవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు ప్రతిఒక్కరికి స్పూర్తిదాయకమని ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివరాముడు, హెచ్డబ్ల్యుఓ భారతీదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్