మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఓటర్ జాబితా అవగాహన వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్ జాబితాపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓటు హక్కుపై చైతన్యం తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చినట్లు తెలిపారు.