తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆదోని
బీజేపీ మండల అధ్యక్షుడు ఉషారాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పైసలతో పోల్చడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం
కాంగ్రెస్ పార్టీ ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. పవిత్రమైన దేవాదాయ శాఖకు మంత్రిగా కొనసాగుతూ దైవాన్ని అవమానించడం అనర్హ చర్యగా పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడం
కాంగ్రెస్ నాయకుల అసలు స్వభావమని విమర్శించారు.