ఆదోని: బ్రెయిన్ స్ట్రోక్ తో బీజేపీ నేత మృతి

0చూసినవారు
ఆదోని: బ్రెయిన్ స్ట్రోక్ తో బీజేపీ నేత మృతి
ఆదోని మండల పరిధిలోని సంతేకోళ్లూరు గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు కురువ మహలింగప్ప ఆదివారం కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురై పడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతదేహాన్ని సంతే కోళ్లూరులోని స్వగృహంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్