ఆదోని: సీఎం చంద్రబాబు గో బ్యాక్

5చూసినవారు
ఆదోని: సీఎం చంద్రబాబు గో బ్యాక్
రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు గురువారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబీర్ భాష, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ తదితరులు మాట్లాడుతూ, ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఆరెకల్ సమీపంలోని మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :