ఆదోని: కురుమ సంఘాల బలోపేతానికి జిల్లాల వారీ కమిటీలు అవసరం

2చూసినవారు
ఆదోని: కురుమ సంఘాల బలోపేతానికి జిల్లాల వారీ కమిటీలు అవసరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆదివారం తిరుపతి జిల్లాలో జరిగిన కురుబ-కురుమ-కురువ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కురుబ-కురుమ-కురువ సంఘాల బలోపేతానికి ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి 10 రోజులకు ఒక జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, పదవులు ఆశించడం కంటే నిస్వార్థంగా సేవ చేస్తేనే గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.