ఆదోనిలో జగనన్న కాలనీల నిర్మాణానికి సేకరించిన భూముల్లో భారీ అవినీతి జరిగిందని
టీడీపీ మైనార్టీ నాయకుడు ఉమ్మి సలీం మంగళవారం ఆరోపించారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డిలు అమాయక రైతులను మోసం చేసి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతులను బెదిరించి, దౌర్జన్యంగా భూములు లాక్కుని, ఒక్కో రైతు వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. బాధిత రైతులు మీడియా ముందుకు వస్తే, వారిని ప్రలోభపెట్టేందుకు అనుచరులు డబ్బులతో బేరసారాలు చేస్తున్నారని సలీం ఆరోపించారు.