ఆదోని: ఈనెల 30లోగా చెల్లించండి – రాయితీ పొందండి

83చూసినవారు
ఆదోని: ఈనెల 30లోగా చెల్లించండి – రాయితీ పొందండి
ఆదోని మున్సిపాలిటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బకాయి ఉన్న ఆస్తి, నీటి పన్నులను ఈనెల 30లోగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ లభించనుందని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2025-26 పన్నును ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఆదోని పట్టణంలో సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు తెరిచే ఉంటాయని కమిషనర్ ఎం. కృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్