ఆదోని: చంటి పిల్లాడితో పరీక్షకు.. ఆలస్యంతో అనుమతి నిరాకరణ

561చూసినవారు
ఆదోని: చంటి పిల్లాడితో పరీక్షకు.. ఆలస్యంతో అనుమతి నిరాకరణ
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ఆదివారం జరిగిన రేషన్ డీలర్ల పరీక్షకు 15 నిమిషాల ఆలస్యం కారణంగా పెద్దతుంబలం కు చెందిన తలారి నాగేంద్రమ్మను అధికారులు అనుమతించలేదు. మావయ్య చనిపోయాడని, అందువల్లే ఆలస్యమైందని పరీక్షకు అనుమతించాలని నాగేంద్రమ్మ వేడుకున్నా అధికారులే కనికరం చూపించకపోవడంతో ఆమె నిరాశతో చంటి పిల్లాడిని ఎత్తుకుని వెళ్లిపోయారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Job Suitcase

Jobs near you