ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డు వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం కురిసిన స్వల్ప వర్షానికి రహదారి చెరువుగా మారి, పత్తి దిగుబడులతో వస్తున్న వాహనం బోల్తా పడింది. దీనివల్ల రైతు పత్తి నీటిలో తడిచి నష్టపోయినట్లు తెలిపారు. రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వర్షపు నీటితో రహదారి నిండిపోవడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.