ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో టీచర్లతో పనిచేయిస్తున్న ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ డా. సిరికి వినతిపత్రం అందజేసిన డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, అడ్మిషన్ల పేరుతో సెలవు రోజుల్లో టీచర్లతో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఆధార్ కార్డులతో అడ్మిషన్లు తీసుకుంటూ, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.